9, ఏప్రిల్ 2014, బుధవారం

నల్లేరు(Cissus quadrangularis) ప్రాచీన మహౌషధి - From My terrace Garden


నల్లేరును వైద్యములో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి ఉపయోగిస్తారు.దగ్గు, కోరింత దగ్గు,శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె ,తేనె,వడియాలలో కలిపి వాడుతారు.
Cissus has been used in various ayurvedic classical medicines to heal broken bones and injured ligaments and tendons.
నల్లేరుమీద బండిలా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుందివజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు.
ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్నిచ్చే మొక్క నల్లేరు. నాలుగు పలకలు కలిగిన కాండంతో సన్నగా పెరిగే తీగజాతి మొక్క నల్లేరు. గణుపు విరిచి మట్టిలో గుచ్చితే చాలు బతుకుతుంది. దీన్ని పెరట్లో నేలలో, కుండీల్లోనూ సులభంగా పెంచుకోవచ్చు. హిందీలోహడ్ జోడ్గా పిలువబడే నల్లేరువిరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తనభవప్రకాశగ్రంథంలో వివరించారు. విరిగిన ఎముకలను అతికించడంలో దీని పాత్ర అమోఘం. పసిపిల్లల ఎముకలు దృఢంగా పెరగడానికి దోహదపడుతుంది. మధ్య వయస్కులకు కీళ్ల నొప్పులు రాకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులుంటే తగ్గిస్తుంది. ఎముకలు పెళుసెక్కడం, ఎముకలు పటుత్వం తగ్గడం వంటి వయోవృద్ధుల సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. దీన్ని నాలుగు వైపులా తొక్క తీసేసి వాడాలి. తొక్కతో పాటు వాడితే నోరు దురద పెడుతుంది. దీన్ని చట్నీ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు చేసి కూరల్లో కలుపుకోవచ్చు. రుబ్బి చపాతీలతో కలిపి వాడుకోవచ్చు. వారానికోసారి బజ్జీలు చేసుకోవచ్చు. ఎండబెట్టి చూర్ణంగా చేసుకొని వాడుకోవచ్చు. నల్లేరు రసం తీసి, రోజూ 2 చెంచాలు తాగుతుంటే విరిగిన ఎముకలు త్వరగా కట్టుకుంటాయి. ఎముక పుష్ఠిని పెంచుతుంది. ఎముకలు విరిగిన వారికి ఆహారంలో ఇవ్వవచ్చు. నల్లేరు కాండాన్ని మెత్తగా నూరి గాయంపై వేసి కట్టుకట్టొచ్చు. 2 చుక్కల నల్లేరు కాడల రసం చెవిలో వేస్తే పోటు తగ్గుతుంది. నల్లేరు ఆకుల రసం 1,2 చెంచాలు తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. కంచెల్లో.. చాలా చోట్ల కనిపించే నల్లేరు ఔషధ గుణాలు తెలుసుకొని వాడుకుంటే బతుకు నల్లేరుపై నడకేనంటే అతిశయోక్తి కాదు.



నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారుదీనిలో విటమిన్‌‘సి’, కెరోటిన్ , స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు. కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే ‘డ్యూరాబొలిన్కంటె ఉత్తమ గుణం  ‘నల్లేరులో వున్నాయని పరిశోధకులు ధృవీకరించారుఅస్థ్ధితువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుందివిరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే ‘మ్యూకోపాలిసాక్రైడ్స్’ దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.
విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గరగణుపు’ వుంటుంది. గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయిఆకులు కూడా  గణుపు దగ్గరే వస్తాయిదీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుందితుంచితే జిగురు వస్తుంది. హిందీలో ‘హడ్జోడ్గా పిలుస్తారు. దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్కాల్షియం, విటమిన్ సికాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలోఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుందికొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితేమహౌషధి’ అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుందిఅటువంటి మహౌషధి నల్లేరు.
జంతు పరిశోధనలో దీనిని ఇచ్చిన తరువాత 21 రోజులలో విరిగిన ఎముక యొక్క రెండు చివరలు అతుక్కుని వుండటం ఎక్స్రేల ద్వారా గమనించారుకార్టిలేజ్లోఆస్టియోబ్లాస్ట్ కణాలలో మార్పును కూడా గమనించారు.
 నల్లేరులో వుండే పోషక ఎనబాలిక్ గుణంవలన నల్లేరు వాడకం ఆస్టియో పోరోసిస్ను నివారించవచ్చు.

Use

Cissus quadrangularis has been used as a medicinal plant since antiquity. In siddha medicine it is considered a tonic and analgesic, and is believed to help heal broken bones, thus its name asthisamharaka (that which prevents the destruction of bones). It is said to have antibacterial, antifungal, antioxidant, anthelmintic, antihemorrhoidal and analgesic activities. It has been found to contain a rich source of carotenoids, triterpenoids and ascorbic acid. Its bactericidal effects on Helicobacter pylori hold promise as a potential treatment of gastric ulcers in conjunction with NSAID therapy. A weight loss supplement containing Cissus quadrangularis and other ingredients including green tea, soy, selenium, chromium, and B vitamins was evaluated in an 8-week trial. The supplement helped reduce body weight by 4-8% ( placebo 2.4%) a clinically significant weight loss.

Experimental studies

A study was undertaken to evaluate the effect of methanolic extract of Cissus quadrangularis L. (CQ) on the healing process of experimentally fractured radius-ulna of dog. CQ treated animals revealed faster initiation of healing process than the control animals on radiological and histopathological examinations. The treated group also revealed a decrease in serum calcium level to a greater extent than the control group. Healing was almost complete on 21st day of fracture in the treated animals and remained incomplete in the control animals. No significant alteration of serum calcium level was observed on 21 st day of fracture in both the groups
A paper published in the World Journal of Gastroenterology in October 2010, on conflicts of interest in alternative weight loss product research, noted that at least three studies supported the safety and effectiveness of CQ for weight loss, but "lack financial disclosures or funding sources, beyond mentioning that the CQ being tested was provided by" General Health Alliances, an herbal products manufacturer. The studies did not disclose that one of its authors was a chief scientific officer for GHA that holds a patent on a CQ product.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి