4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ముళ్ళ గోరింత పువ్వులు

7 కామెంట్‌లు:

  1. అబ్బ ఎన్ని రొజులు అయ్యిందోనండీ ఈ పూలు చూసి
    చిన్నప్పుడు డిశంబరాలు,ముళ్ళగోరింటపూలు,చంద్రకాంతలు ఇవన్ని ఫ్రెండ్స్ తో కలిసి మాలలు కట్టేవాళ్ళం.ఆ రొజులు గుర్తొచ్చాయి
    థాంక్యూ

    రిప్లయితొలగించండి
  2. అబ్బ డిసెంబరాలని చూసి ఎన్నాళ్ళయిందండీ..ఇవి మా ఇంత్లొవిరగగాసేవి....దండలు కట్టి తల్లో పెట్టుకునేవాళ్ళం...పసుపు, గులాబి, తెలుపు రంగుల్లో బలే ఉండేవి.

    నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి...మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. ముళ్లగోరింట పూలు భలే ఉన్నాయి...ఇప్పుడు ఊళ్లల్లో కూడా ఇవి అంతగా కనిపించటం లేదు సౌమ్య గారూ..పైవి ముళ్లగోరింట పూలు..డిసెంబరాలు ఇవీ వేరు కదా!

    రిప్లయితొలగించండి
  4. అబ్బ డిసెంబరాలని చూసి చాల రోజులయ్యింది.కాని కలర్ మారింది.ఏమిటి
    వంగ పూవు రంగు లో వుండేవి.మరి ఇక్కడ తెలుపు రంగు లో వున్నాయీ
    మ ఇంటి దగ్గర చాల మొక్కలు వుండేవి .

    రిప్లయితొలగించండి
  5. ఇవి మా అమ్మ వాళ్ళింట్లో ఇప్పటికీ రోజూ పూస్తున్నాయి. డిసెంబర్ పూలకంటే నాకు ఇవే నచ్చుతాయి. అమ్మ అయితే "బంగారు పువ్వులు" అనేది ఆ రంగు చూసి! వీటి రేకు నాలుక మీద పెట్టుకుని suck చేసి బుడగ తెప్పించి నుదురుకేసి కొట్టుకుని ఠప్ మనిపించడం చిన్నప్పటి సరదా!

    ఎవరైనా ఇలా చేశారా మీలో?

    ఇవీ డిసెంబరాలు వేరు! మా ఇంట్లో రెండు మూడు రంగుల్లో డిసెంబరాలు కూడా ఉన్నాయి. వంగపూవు రంగుమీద తెల్లటి గీత తో పూసేవీ, లవెండర్ కలర్లో పూసేవీ!

    ఇప్పుడు నవ్వొస్తుంది కానీ, చిన్నప్పుడు మూరెడు దండలు తల్లో పెట్టుకుని......స్కూలుకెళ్ళడం!

    రిప్లయితొలగించండి
  6. --బుడగ తెప్పించి నుదురుకేసి కొట్టుకుని ఠప్ మనిపించడం చిన్నప్పటి సరదా!
    --ఎవరైనా ఇలా చేశారా మీలో?

    నేను చేసా :-)

    రిప్లయితొలగించండి
  7. ఇవి గొబ్బి పూలండీ.విశాఖ జిల్లాలో డిసెంబరాలకంటే ఇవి ఎక్కువగా దొరుకుతాయి.

    రిప్లయితొలగించండి