7, ఏప్రిల్ 2014, సోమవారం

వేమన శతకము

కల్ల నిజములెల్ల గరళకంఠు డెరుగు
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగును తనయుని జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.


ఏది అబద్దమో, ఏది నిజమో ఆ పరమేశ్వరునికి తెలుసు. పల్లము ఉన్న వైపుకే నీరు ప్రవహించును.కుమారుని గురించి నవమోసాలు మోసి కన్న తల్లికి తప్ప అన్యులకు తెలియదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి