రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁజెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.
శ్రీరామచంద్రుడంతటి ఉన్నత గుణములు కలిగినవాడు సూర్యవంశమునందు జన్మించుట వలన ఆ వంశము చరితార్థమైనది.అలాగే దుర్యోధనుడు జన్మించుట వలన కురువంశము నామరూపాలు లేకుండా పోవడమే కాకుండా ఆ వంశానికి ఎన్నటికి చెరిగిపోని అపఖ్యాతి కూడా కలిగింది.ఇవే పాప పుణ్యముల ఫలితాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి