8, ఏప్రిల్ 2014, మంగళవారం

దాశరథీ



రీ రఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దు
ర్వార కబందరాక్షస విరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారక నామ భద్రగిరిదాశరథీ!కరుణాపయోనిథీ!

శోభాయుక్తమైన రఘువంశపురామా,మనోహరమైన తులసి యాకుల మాలను ధరించినవాడా,శాంతము సహనము మున్నగు సద్గుణములచే నొప్పువాఁడా,ముల్లోకములవారిచే నుతింపఁబడు పరాక్రమసంపద గలవాఁడా, అడ్డగింపశక్యము గాని కబందుఁడెనడు రాక్షసుని నశింపఁజేసినవాఁడా,లోకము లంశలి వారిని పాపసముద్రమునుండి దాటించు నామము గలవాఁడా,భధ్రాచల రామా,దయాసముద్రఁడా.

1 కామెంట్‌: