పిచుకలు
- మనకు చిననాటినుంచి మిత్రులు
వాటిని
చూడగానే
ఏదో తెలియని ఆత్మీయత
ఏదో తెలియని ఆప్యాయత
ఏదో తెలియని అనురాగం
ముద్దులోలికే బుల్లి పిచుకలను చూస్తే ఎవరికైనా వాటి అందమైన చేష్టలు , కిచకిచలు మదిలో మెదులుతాయి
ముద్దులోలికే బుల్లి పిచుకలను చూస్తే ఎవరికైనా వాటి అందమైన చేష్టలు , కిచకిచలు మదిలో మెదులుతాయి
"నీవు
గాలిలో కనపడితే మా గుండెలు ఆనందడోలికలలో తేలిఆడతాయి
స్వేచ్చగా,
ఇంటి చూరులో వెచ్చగా నీవు నలువైపులా చూస్తువుంటే,
ఆ మూల నుంచి ఈ
మూలకు, ఈ మూల నుంచి
ఆ మూలకు
నీవు
ఎగురుతూ వుంటే మా నకశిక
పర్యంతము ఏ మూలో
దాగివున్న
ఆనందసాగరాలు ఎగిసి
పడతాయి."
అద్దములో
నీ ప్రతిబింబాన్ని ముక్కుతో ముచటలాడుతుంటే
కొత్త
కోడలు పదేపదే ముఖాన్ని అద్దములో చూసుకొన్నట్టు వుంటుంది
అవి చూసే అమాయకపు
చూపులు
అవి కనపడకపోతే ఏదో కోల్పోయాము అన్న
బాధ
పిచుక.
ఈ పేరు వింటేనే.. ప్రతి
ఒక్కరికీ చిన్ననాటి అనుభవం ఏదో ఒకటి గుర్తురాక
మానదు. పొద్దు పొడవక
ముందే ఇంటి చూరిపై గుంపుగా
వాలి.. కిచ కిచమంటూ మనల్ని
నిద్రలేపిన మన ఊరి పిచుకలు
గుర్తొస్తాయి.
ఆనక పొలంగట్టు పైనుంచి బిలబిలమంటూ ఎగురుకుంటూ వరికంకులపై వాలిన పిచుకలు మన
మస్తిష్కంలో..
దృశ్యంగానూ మెరవొచ్చు.
కీటక సంహారం నా భోజనం,రైతుకు సాయం నా వ్యాపకం, రాలిన గింజలే నా విందు భోజనం, రైతు నాపై చూపే మమకారం.
అవును
మరి అవి మన పర్యావరణాని
సమతులం లో ఉంచుతాయి. పిచుకలు
లేని లోకాన్ని ఊహించలేము, ఈ జగత్తులో పిచుకలు
లేకుండా మనము బతకలేము -
మీరు నమ్మక పోయినా ఇది నిజం.
ఇంటి
గుమ్మాలు , లోగిళ్ళలో సందడి చేసే పిచుకలు
కనుమరుగు అవుతున్నాయి. మనుషులతో మమేకమై అవి చేసే కిల
కిల రావాలు మూగబోతున్నాయి.
పిచుక
మీద భ్రహ్మస్త్రం - అవును మనము అదే
పని చేస్తున్నాము ఇప్పుడు
అవి మనకి సహాయము చేస్తూవుంటే
మనము వాటిని చంపుతున్నాము.
ప్రజల
వినియోగించే సెల్ఫోన్ వాటి
టవర్ల నుంచి వచ్చే రేడియేషన్
ప్రభావం వల్ల సంతానోత్పత్తి శక్తిని
కోల్పోతున్నాయి. దీంతోపాటు పచ్చని పల్లెలన్నీ కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్నాయి. వేలెడంత పిచుకకు నిలువ నీడనిచ్చే పరిస్థితే
సమాజంలో కరవవ్వడంతో ఇప్పడు పిచుకల మనగడ ప్రశ్నార్ధకంగా మారింది.
మరో కొన్నాళ్ళుపోతే... పుస్తకాల్లో మాత్రమే పిచుకల్ని బొమ్మలుగా.. చూడాల్సి వస్తుంది
ఆ పరిస్థితి వస్తే ఈ ప్రపంచమే
అంతరించి పోతుంది.
అందుకనే పిచుకలని
కాపాడదాము
అందరమూ
వాటికి ఆహారము , నీరు అందించి వాటిని
పెంచి పోషిద్దాము, పర్యావరణాన్ని కాపాడదాము
నేను ఆహారము
, నీరు రోజు పెడతాను , మీరు అలాగే చెయ్యగలరని ఆశిస్తున్నాను .
మమమందరమూ పిచుకలను
కాపాడదాము అని ప్రతిజ్ఞ చేద్దాము
మా ఇంట్లో పిచుకలకు
ఆహారము, నీరు, గూడు , మరి మీరు ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి