22, జూన్ 2014, ఆదివారం

Pushpavilapam Telugu Original Song By Ghantasala & Jandhyala Gaaru



కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన గ్రామఫోను రికార్డుల వలన ఈ పద్యాలు ఆంధ్రదేశమంతటా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.

ఒక భక్తుడు పూజకోసం పూలుకోయాలని పూలతోటకు వెళ్ళినపుడు అతనికి ఆ పూల ఆవేదన మనసులో మెదిలింది. హాయిగా చెట్టుపైనున్న పూలను కర్కశంగా కోసి, సూదులతో గ్రుచ్చి, త్రాళ్ళతో బిగించి, మానవులు తమ భోగ వస్తువులుగా వాడుకోవడం క్రౌర్యం అని ఆ పూలు రోదిస్తున్నట్లుగా కవి వర్ణించాడు.
పూల గురించి కవులు, కావ్యాలు పలు విధాలుగా వర్ణించారు. కాని ఈ విధంగా స్పందించడం బహుశా తెలుగులో ఇదే ప్రధమం కావచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి