జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!- జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!
- జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!
- జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!
- జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!
- జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!
- జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!
- జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!
ఈ గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విధ్యార్థుల కోసం వ్రాసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి