
వీరి కలం పే రు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదు మ దురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. జూన్ 22, 1992లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు. ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల వీరి కుమారుడే.
రచనలు
- పుష్పవిలాపము
- కుంతీకుమారి
- అంజలి పద్యాలు
ఘంటసాల గారి రికార్డుల పుష్పవిలాపం పద్యాలు బాగా ప్రాచుర్యము పొందాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి