2, మే 2014, శుక్రవారం

అడివి బాపిరాజు -- "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే - బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త

చిత్రం: అడివి బాపిరాజు

అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశారు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పని చేశారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకరు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచారు.
రచయితగా తెలుగు సాహిత్యానికి, సంపాదకుడిగా తెలంగాణ పత్రికా రంగానికి తద్వారా మొత్తం తెలుగు సమాజానికి అడివి బాపిరాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం జమానాలో హైదరాబాద్ రాజ్యంలో తెలుగు పత్రికా రంగానికి బలమైన పునాదులు వేసిన అగ్రగణ్యులైన సాహితీ వేత్తల్లో, సంపాదకుల్లో ఆయనొకరు. హైదరాబాద్లో 1943లో స్థాపించబడ్డ ‘మీజాన్’ దిన పత్రిక సంపాదకుడిగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రజలకు ఆప్తుడయ్యాడు. పత్రికా యాజమాన్యం ప్రధానోద్దేశ్యం ‘మీజాన్’ ద్వారా ‘నిజాం కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం.’’ అయితే అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటా’నికి, కాంగ్రెస్ వారు నిర్వహించిన ‘ఆంధ్రమహాసభ’, ‘భారతదేశంలో హైదరాబాద్ విలీనోద్యమాల’కు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు. అసిధారావ్రతం లాంటి తన  సంపాదకీయ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన ఆయన ప్రతిభ అద్వితీయం. అన్ని పార్టీల్లోనూ మిత్రులుండడం, అభ్యుదయ రచయితల సంఘం హైదరాబాద్ స్థాపక అధ్యక్షుడిగా, చారిత్రక నవలా చక్రవర్తిగా, తెలంగాణ చరిత్రను నవలా రూపంలో అక్షరీకరించి గోనగన్నారెడ్డి లాంటి వ్యక్తులకు జీవం పోసిన బాపిరాజు తెలంగాణకు ఆత్మీయుడు.
బాపిరాజు చాలా నేర్పుగా ‘తెలంగాణ సాయుధ పోరాట’ వార్తలను అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రచురించేవాడు. ఆళ్వారుస్వామి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మాడపాటి హనుమంతరావులతో సాన్నిహిత్యం ఉండటంతో వారు నిర్వహించే వివిధ ప్రజా ఉద్యమాలకు పత్రిక ద్వారా దన్నుగా ఉండేవాడు. మీజాన్ పత్రికలో బాపిరాజు వెలువరించిన వందల కొద్ది రచనలు ఇప్పటికీ పుస్తక రూపంలో అందుబాటులోకి రాలేదు. మందుమల నరసింగరావు, రామచంద్రరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రాజబహదూర్ గౌర్ లాంటి ఆనాటి రాజకీయ ఉద్యమకారుల జీవితాల్ని ‘ప్రతిరూపములు’ శీర్షికన శశికాంతుడు పేరిట అడివి బాపిరాజు వెలువరించారు. ఈ వ్యాసాలు ఆనాటి ఉద్యమరూపానికి ప్రత్యక్ష ప్రతిరూపాలు. అయితే దురదృష్ట వశాత్తు ఈ వ్యాసాలేవి ఇంతవరకూ పుస్తక రూపంలో ముద్రణకు నోచుకోలేదు. దీనికంతటికీ ప్రధాన కారణం మీజాన్ పత్రిక ప్రతులు చాలా అరుదుగా లభించడం, అవికూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించారు.అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశారు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పని చేశారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకరు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచారు.
రచయితగా తెలుగు సాహిత్యానికి, సంపాదకుడిగా తెలంగాణ పత్రికా రంగానికి తద్వారా మొత్తం తెలుగు సమాజానికి అడివి బాపిరాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం జమానాలో హైదరాబాద్ రాజ్యంలో తెలుగు పత్రికా రంగానికి బలమైన పునాదులు వేసిన అగ్రగణ్యులైన సాహితీ వేత్తల్లో, సంపాదకుల్లో ఆయనొకరు. హైదరాబాద్లో 1943లో స్థాపించబడ్డ ‘మీజాన్’ దిన పత్రిక సంపాదకుడిగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రజలకు ఆప్తుడయ్యాడు. పత్రికా యాజమాన్యం ప్రధానోద్దేశ్యం ‘మీజాన్’ ద్వారా ‘నిజాం కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం.’’ అయితే అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటా’నికి, కాంగ్రెస్ వారు నిర్వహించిన ‘ఆంధ్రమహాసభ’, ‘భారతదేశంలో హైదరాబాద్ విలీనోద్యమాల’కు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు. అసిధారావ్రతం లాంటి తన సంపాదకీయ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన ఆయన ప్రతిభ అద్వితీయం. అన్ని పార్టీల్లోనూ మిత్రులుండడం, అభ్యుదయ రచయితల సంఘం హైదరాబాద్ స్థాపక అధ్యక్షుడిగా, చారిత్రక నవలా చక్రవర్తిగా, తెలంగాణ చరిత్రను నవలా రూపంలో అక్షరీకరించి గోనగన్నారెడ్డి లాంటి వ్యక్తులకు జీవం పోసిన బాపిరాజు తెలంగాణకు ఆత్మీయుడు.
బాపిరాజు చాలా నేర్పుగా ‘తెలంగాణ సాయుధ పోరాట’ వార్తలను అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రచురించేవాడు. ఆళ్వారుస్వామి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మాడపాటి హనుమంతరావులతో సాన్నిహిత్యం ఉండటంతో వారు నిర్వహించే వివిధ ప్రజా ఉద్యమాలకు పత్రిక ద్వారా దన్నుగా ఉండేవాడు. మీజాన్ పత్రికలో బాపిరాజు వెలువరించిన వందల కొద్ది రచనలు ఇప్పటికీ పుస్తక రూపంలో అందుబాటులోకి రాలేదు. మందుమల నరసింగరావు, రామచంద్రరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రాజబహదూర్ గౌర్ లాంటి ఆనాటి రాజకీయ ఉద్యమకారుల జీవితాల్ని ‘ప్రతిరూపములు’ శీర్షికన శశికాంతుడు పేరిట అడివి బాపిరాజు వెలువరించారు. ఈ వ్యాసాలు ఆనాటి ఉద్యమరూపానికి ప్రత్యక్ష ప్రతిరూపాలు. అయితే దురదృష్ట వశాత్తు ఈ వ్యాసాలేవి ఇంతవరకూ పుస్తక రూపంలో ముద్రణకు నోచుకోలేదు. దీనికంతటికీ ప్రధాన కారణం మీజాన్ పత్రిక ప్రతులు చాలా అరుదుగా లభించడం, అవికూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి