30, ఏప్రిల్ 2014, బుధవారం

త్రిపురనేని రామస్వామి --- ''వీర గంధం తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ''

చిత్రం: త్రిపురనేని రామస్వామి

కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించారు.
జాతీయోద్యమ స్ఫూర్తితో 1930లో ఉప్పుసత్యగ్రహాన్ని ఆహ్వానిస్తూ, సత్యాగ్రహ ఉద్య మానికి ఎంతో బలాన్ని చేకూ రుస్తూ ''వీర గంధం తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ'' అనే స్ఫూర్తి దాయకమైన జాతీయ గేయాన్ని రచించారు. అది ఎందరినో ఎంతగానో ఉత్తేజపరిచింది.
మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, మత ఛాందసత్వాన్ని, సాంఘిక అస మానతలను వ్యతిరేకిస్తూ, సాహిత్యం ద్వారా సంఘ సంస్కరణకు మరింత బలం చేకూర్చిన ప్రముఖులు కవిరాజు త్రిపురనేని రామస్వామి.
రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగారు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనారు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామము అను రెండు నాటికలు రచించారు. 1911 లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కాలేజీలో చేరారు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించారు.
1898 లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నారు. 1910లో వారికి ఒక కొడుకు జన్మించారు. ఆయనే ప్రఖ్యాత రచయిత, త్రిపురనేని గోపీచందు. 1914 లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లారు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివారు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనీ బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ కృష్ణా పత్రిక లో అనేక రచనలు చేశారు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్పూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక దేశభక్తి గీతాలు రచించారు.

1917 లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించారు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించారు. 1922 లో గుంటూరు జిల్లా, తెనాలి లో స్థిరపడ్డారు. 1925 లో తెనాలి పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యారు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించారు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
1927లో తెనాలిలో తన స్వగృ హానికి ''సూతాశ్రమం'' అని పేరు పెట్టారు. అది ఆయన కార్యక్రమా లకు కేంద్ర బిందువు. కవిరాజు త్రిపురనేనిగా ఆంధ్రదేశం అంతా ప్రఖ్యాతి చెందిన ఆయన ఎన్నో ఖ్యాతిగన్న రచనలు చేశారు. వర్ణాశ్రమ ధర్మాన్ని వ్యతిరేకిం చారు. మూఢనమ్మకాల బండా రాన్ని బట్టబయలు చేశారు.
 అంత వరకు సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసారు. ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించారు.
 మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, మత ఛాందసత్వాన్ని సాంఘిక అసమానతలను వ్యతిరేకిస్తూ కుప్పుస్వామి శతకం రచించారు.ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 
ఆయన సాహిత్య కృషిని గుర్తించి, ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము చేసారు.
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నారు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించారు. ఈయన చేసిన ముఖ్య రచనలు:
• సూతపురాణము
• శంబుకవధ
• సూతాశ్రమ గీతాలు
• ధూర్త మానవ శతకము
• ఖూనీ
• భగవద్గీత
• రాణా ప్రతాప్
• కొండవీటి పతనము
• కుప్పుస్వామి శతకం
• గోపాలరాయ శతకం
• పల్నాటి పౌరుషం
• వివాహవిధి

ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం:
వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో
రైతు,దీనజన పక్షపాతిగా వారి సేవనే తన మార్గంగా ఎంచుకొన్నాడు. మానవసేవే మాధవసేవ అని నమ్మాడు. చూడండి...
మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.

మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతోన్మాదులను ఈసడిస్తూ ....

ఒకరుడు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
కొకరుడు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
రొంకరుడు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ
తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.

మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. 1943 జనవరి 16 న త్రిపురనేని రామస్వామి మరణించారు.కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించారు.

మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. 1943 జనవరి 16 న త్రిపురనేని రామస్వామి మరణించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి