20, ఏప్రిల్ 2014, ఆదివారం

సరోజినీ నాయుడు - స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ఒకరు.

చిత్రం: సరోజినీ నాయుడు

ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు కూడా ఒకరు.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
సరోజినీ నాయుడు 1879 వ సంవత్సరం జనవరి నెల 13 వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు. వీరిది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. ఈమె తండ్రి డా. అఘోరనాథ్ చటోపాథ్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (అనగా నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పని చేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలూ, కథలు వ్రాయడం జరిగింది.తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడింబరో విశ్వవిద్యాలయం లో డాక్టరు పట్టాను పొందటం జరిగినది.
ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించు కోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయం లోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో తెలుసుకొనే వరకూ విశ్రమించరు కొందరు. రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.
చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషు లో రచనలు ఆరంభించింది కూడా!
ఆమె పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్ లేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల భక్తి భావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ, విద్య యందు దృష్టి నుంచక, గురువులు చెప్పె పాఠాలు, కాలక్షేపానికి భావిస్తూ, గురువులను సాటి విద్యార్థులనూ ఆవహేలన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తించి, జీవితంలో అడుగు పెట్టి సాధక, బాధకాలు ఎకురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి.
1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, ఆమె శ్రీ గోవిందరాజులు నాయుడు గారిని పెండ్లాడటం జరిగింది. గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధారోగ్యాధికారి. కులం మతమూ అనె మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు. ఈ కుల, మతము లేకమై జాతి జీవనంపై గొడ్డలి పెట్టు పెడుతూ, వర్గ భేధాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులు అంటూ జానిని వేర్పాటు ధోరణికి బలి చేస్తుందనీ, కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమె కమ సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం.
ఆమె అదే అభిప్రాయంతో శ్రీ గోవిందరాజులు నాయుడు తన కులము కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శము కావాలన్న అభిప్రాయంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు వీరి వివాహం జరిపించారు. ఆమె చేసిన పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవతా ముఖ్యం కాని, అర్థం లేని గ్రుడ్డి నమ్మకాలను ప్రోత్సహించి జాతిని పతనము చేసే కులము కాదని ఆమె నిరూపించగలిగింది. తనూ, తన భర్త, ఆచార వ్యవహారాలు భిన్నమైన కులాలైనా మనసున్న మనుషులుగా సంస్కార వంతులుగా నియమబద్దమైన జీవితం సాగించసాగారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారము దిద్దుకోగలిగితే కులము గొడవ ఏదీ లేదనై మిగిలిన సమాజానికి నిరూపించారు.
వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయి లో జరిగిన కాంగ్రెస్ మహాసభ లకూ, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారత దేశములో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని మరుగున ఉన్న యదార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాసం శ్రోతలకు కాలం, శ్రమ తెలియనిచ్చేవి కావు.
ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకతి కొట్లకో బలయ్యేబదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యె అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశనికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసించా వీరతిలకం.
ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ , ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం పాడైంది. 1919 సంవత్సరం లో పంజాబ్ లోని జలియన్ వాల బాగ్ లో హత్యా కాండ బరిగింది. ఆ సమయానికి సరోజినీనాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. అప్పటి పంజాబ్ గవర్నరైన డయ్యర్ లక్షలాది ప్రాణాలను తుపాకి గుండ్లకు బలిచేసి దారుణంగా హింసించి, చంపిన విషయం ఆమె లండన్ నగరంలో విన్నది. ఆమె గుండె ఆ వార్తకు నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండె జబ్బుతో ఉన్నదని బాగా ముదిరిపోయినదని చెప్పారు వైద్యులు. అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి. ఆమె గుండె జబ్బుకాక చనిపోయిన వారి భార్యలు, కుమార్తెలు ముమారుల గుండెలు పగిలే శోకాలు తలుచుకొని ఆ కరుణామూర్తి చలించిపోయింది.
ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయక చిశాచి పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది. గాంధీజీకి పంజాబ్ దారుణము గురించి ఉత్తరము వ్రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించనిదే నిద్రపోననీ వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారత దేశం నుంచి వారిని తరిమి కొట్టి, భారతీయుల స్వేచ్ఛ చూడనిదే, భరతమాత ఆత్మ శాంతించదని తన సందేశము ద్వారా తెలియపరిచింది.
సరోజిని లండన్ నగరము నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి, భారతదేశములో ఓడ దిగటం తోటే శాసన ధిక్కారం అమలు పరిచింది. స్వాతంత్రోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని, బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. ఆ ఆజ్ఞలు ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు. గాంధీజీ సలహాపైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతివీధిలోనూ అమ్మి ప్రభుత్వ శాసన ధిక్కారం జరిపింది సరోజినీనాయుడు.
భారత దేశం పైనా , భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మరచిపొయ్యె విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనె ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిషు పాలకులు భారతదేశాన్ని స్వంతంగా భావించడమే అపరాధం. భారతీయుల హక్కుల గురించి బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం" అంటూ ఆడపులిలా గర్జించింది.
లండన్ కామన్స్ సభలోని భారత దేశ మంత్రి ఆమె చేస్తున్న తిరుగు బాటు ధాటికి చలించిపోయ్యాడు. ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్య వద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమనూ, ఆమెకు గల స్వాతంత్ర్య పిపాసనూ అర్థం చేసుకుని అప్పటి నాయకుడైన గాంధీజీ ఆనందానికి అంతులేకుండాపోయింది. ఆయన రాజద్రోహము, నేరము క్రింద ఆరేండ్లు జైలు శిక్ష ననుభవించేందుకు వెళుతూ సరోజినీనాయుడు పై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించి చేతిలో చేయి వేసుకున్నారు.
ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్ర్య ప్రభోదం ముమ్మరంగా సాగించింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. తన భర్త బిడ్డల యోగక్షేమాలు కూడా మాని సాటి భారతీయులంతా బిడ్డల మాదిరిభావింది పర్యటన సాగించిందా త్యాగమూర్తి. విరామ సమయాలలో దేశ ప్రజల భవిష్యత్ ను గురించి బ్రిటిష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు చేస్తూనె ఉంది. ఎక్కదున్నా, ఏదో ఒక రకంగా దేశ ప్రజలకు స్వాత్ర్ంత్ర్య ప్రభోదాలు అందజేస్తూనే ఉందావిడ.
పురోగతినీ, స్వచ్చమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్య జీవితాలను వాంఛించిన పురుష కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా స్త్రీయై ఉండి కూడా జాతి విమోచనానికి శాయశక్తులా అహోరాత్రులు కృషి చేసిన త్యాగ పూరిత కవయిత్రి శ్రీమతి సరోజినీనాయుడనటంలో యే మాత్రము సందేహం లేదు.
ఆమె దేశానికి చేసిన సేవల ఫలితంగా, ఆమెకు దేశంపై గల నిష్కళంక ప్రేమ ఫలితంగా కాన్పూరు లో 1925 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలైంది. "పీడిత ప్రజల విమోచనానికి జాతి, మత, కులపమైన భెదాలు ఇనిప సంకెళ్ళన్నీ, భారతీయులంతా ఒక్కటేనని, స్త్రీ పురుష భేదములేకుండ త్యాదం చేస్తె గానీ, జాతి బానిసత్వం నుంచి విమోచన పొందదని, అవసరమైతే ప్రాణత్యాగాల కైనా వెనుకాడవద్దనీ, బానిస భావంతో తరతరాలు మ్రగ్గిపోతూ బ్రతికే కంటే త్యాగంతో ఒక తరం అంతరించి భావితరాలు వారికి స్వేచ్ఛను ప్రసాదించటం జాతీయ సంస్థ లక్ష్యమనీ!" మహోపన్యాసం యిచ్చి లక్షలాది ప్రజలను స్వాతంత్ర్య పిపాసులుగా తయారుచేసింది.
కెనడా, అమెరికా మొదలైన దేశాలకు 1928 లో వెళ్ళి భారతీయుల బానిసత్వాన్ని గురించీ వీరి ఆశయాల గురించీ ప్రచారం చేసింది. 1929 లో తూర్పు ఆఫ్రికా అంతా ప్రచారము చేస్తూ పర్యటించింది. గాంధీజీ అరెస్టయినది మొదలు విశ్రాంతి అనే మాటకు తావివ్వకుండా దేశ, దేశాలు పర్యటిస్తూ పీడిత భారత ప్రజల విముక్తికి ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఒక భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారనికి బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. ఆమెను స్వేచ్ఛగా తిరగనీయడం తనకూ, తన దగాకోరు పరిపాలనకూ తగదని తలంచి 1930 వ సంవత్సరం మే 23 వతేదీన శ్రీమతి సరోజినీ నాయుడును అరెస్టు చేసింది. అరెష్టయినందుకు గానీ, జైలు జీవితం అనుభవించేందుకు గానీ ఆమె ఏ మాత్రం భయపడలేదు. అవసరమైతె ప్రాణాలే ధార పోయాలని నిశ్చయించుకున్న దేశభక్తురలికి ఏడెనిమిది నెలల జైలు జీవితం మొకలెక్కా, సమర్థురాలైన నాయకురాలిని. నిస్వార్థ దేశభక్తురాలిని అరెష్టు చేశారని విని గాంధీజీ ఎంతో బాధపడ్డాడు.
తను జైల్లో ఉన్నా అటువంటి ప్రచారకులు చీకటిలో ఉండటం వలన ప్రచారం ముమ్మరంగా సాగే అవకాశాలు లోపించగలవని ఆయన బాధ.
భారతీయ ప్రతినిధిగా 1931 వ సంవత్సరం లో లండన్ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళింది సరోజినీ నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 లో బ్రిటిష్ ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్ర్య పోరాటం సాగించిందామె. అందుకు ఫలితంగా అరెష్టు చేయబడి, దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితం నవ్వుతూ అనుభవించింది. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆమెను విడుదల చెయ్యవలసి వచ్చింది.
తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహితాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నో లో ప్రశాంతంగా కన్ను మూసింది.
సరోజినీ నాయుడు నివసించిన ఇంటికి ఆమె రాసిన మొదటి కవితాసంపుటి గోల్డెన్ థ్రెషోల్డ్ గా పేరు పెట్టి, హైదరాబాద్ యూనివర్సిటీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ హైదరాబాద్ పర్యటనకు గుర్తుగా నాడు గాంధీజీ నాటిన చెట్టు ఉంటుంది. మహిళా విద్యకోసం, హిందూ ముస్లీంల మధ్య సోరదభావం కోసం పనిచేసిన సరోజినీనాయుడు స్పూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని, రాజకీయరంగంలో తమ ప్రతిభను చాటుకోవాలని ఆశిద్దాం.
ఈ దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు  ఒకరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి