23, మార్చి 2014, ఆదివారం

యల్లాప్రగడ సుబ్బారావు - భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి.

చిత్రం: యల్లాప్రగడ సుబ్బారావు

యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12,1895- ఆగష్టు 9,1948) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి.
ఇయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895 , జనవరి 12 న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, హైస్కూల్ చదువులు పుర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనకు చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయననూ రాజమండ్రి కి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. తండ్రి చనిపోవడంతో తల్లి తన వస్తువులను తాకట్టుపెట్టి వైద్యశాస్త్రం చదివించింది.
మద్రాసు హిందూ హైస్కూలు లో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘసంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా , ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజీ ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.
దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి చెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించారు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యారు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశారు. విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయానల్ల దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నారు. 
సుబ్బారావు భావాలలో నైశిత్వము ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) కనిపెట్టారు.
వైద్యశాస్త్రంలో అందులోనూ ముఖ్యంగా లివర్పై పరిశోధన ఎంతో పట్టుదలతో, దీక్షతో కొనసాగించి కొత్త మందులను కనుగొని మానవజాతికి మహోపకారం చేశారు. అందుచేతనే వైద్యశాస్త్ర చరిత్రలో డాక్టర్ సుబ్బారావుకు ఈనాటికీ విశిష్ట స్థానం ఉంది.
సుబ్బారావు ఆఖండ ప్రజ్ఞాశాలి, ఫొటోగ్రాఫిక్ మెమరీ. ఒక్కసారి చదివితే చాలు. అన్ని సబ్జెక్టులూ బాగా పాసయినా, సర్జరీలో పాశ్చాత్య క్రైస్తవ ఉపాధ్యాయునికి ఇతనంటే గిట్టకపోవడంతో ఫెయిల్ చేశారు. దానితో యం.బి.బి.యస్ బదులు యల్.యం.యస్ డిగ్రీ మాత్రం లభించింది. అయినా అమెరికాలో పరిశోధన చేయడానికి ఆ డిగ్రీ సరిపోతుందని గుర్తించి, అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో సమశీతోష్ణి మండల వ్యాధుల గురించి పరిశోధనకు పూనుకున్నాడు. ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని మేళవించి పరిశోధన చేస్తే స్ఫ్రూ వ్యాధిని నిరోధించవచ్చునని పరిశోధన చేసి విజయం సాధించారు. తనకి స్కాలర్షిప్ లేకపోయినా, 1923లో గర్భవతి అయిన తన భార్యకు నచ్చజెప్పి కడసారి ఆమెను చూచి అమెరికా వెళ్ళి రిసెర్చిలో మునిగిపోయాడు. బయోకెమిస్ట్రీలో నిష్ణాతుడయ్యారు. అమెరికా వెళ్ళిన ఒక్క సంవత్సరంలోనే అతని పేరు మారుమ్రోగింది. ఫాస్పరస్ను అంచనా వేయడానికి సుబ్బారావు రూపొందించిన పద్దతికి తన ప్రొఫెసర్ పేరు జోడించి ''ఫ్రిస్క్-సుబ్బారావు మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫార్ఫరస్'' అని నామకరణం చేశారు. 1924 డిసెంబర్ 29న అమెరికన్ సొసైటీ ఆఫ్ బయలాజికల్ కెమిస్ట్స్ మహాసభలో అతని ప్రదర్శనను చూపించాడు. దానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే 1925లో వెలువడిన బయోకెమిస్ట్రీ పుస్తకాలన్నింటిలో ప్రపంచ వ్యాప్తంగా ఆ నూతన ఆవిష్కరణను సవివరంగా పేర్కొనడం జరిగింది. ఆ కాలంలో మనదేశంలో తెల్ల-నల్ల తేడా ఎంత ఎక్కువగా ఉండేదంటే సుబ్బారావు హార్వర్డ్లో డాక్టరేట్ చేసినా కలకత్తాలోని ఇంపీరియల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో అతను నల్లవాడు కనుక ప్రొఫెసర్ షిప్ ఇవ్వలేదు. దానితో అమెరికాలోనే ఉండిపోయి తన పరిశోధనలు కొనసాగించాలని నిశ్చయించారు. అమెరికాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, లివర్పై పరిశోధనలు కొనసాగించి, ఎన్నో క్రొత్త విషయాలు కనుగొన్నారు. కాలేయంపై విస్తృతంగా పరిశోధన జరిపి రక్తస్రావం నిరోధించడానికి కె-1 విటమిన్ను రూపొందించారు. అదే విధంగా విటమిన్-జి రూపొందించడానికి హార్వర్డ్లో 15 సంవత్సరాలు పరిశోధన జరిపారు. పాండురోగమైన బెరి బెరి వ్యాధి మనరాష్ట్రంలో ఎక్కువగా ఉండేది. దీనిని ఆరికట్టడానికి ''థియామిన్'' విటమిన్ను కూడా సుబ్బారావు కనుగొన్నారు. పరిశోధన తనదైనా పేటెంట్ల విషయంలో వచ్చిన వివాదం వల్ల సుబ్బారావుకు తగినంత ఖ్యాతి దక్కలేదు. అదే విధంగా ''దిప్తీరియా'' (కంఠసర్పి) నివారణకు కూడా సుబ్బారావు పరిశోధన కొనసాగించారు. కాలేయంపై అతను చేయని పరిశోధన లేదు. లివర్ ఎక్స్ట్రాక్ట్ను రూపొందించడంలో కృషి చేశారు. హార్వర్డ్లో 15 సంవత్సరాలలో కాలేయం, విటమిన్లు, పోషకాహారంపై ఎన్నో మౌళిక పరిశోధనలు జరిపారు. 1940లో ఆ యూనివర్సిటీని వదిలి లీడర్లీ కంపెనీ ఆధ్వర్యంలో ఫార్మాస్యూటికల్ పరిశోధనతో బయటకు వచ్చారు. వందలాది మంది నిష్ణాతులైన పరిశోధకులు అతనిక్రింద పనిచేశారు. లీడర్లీ లేబరేటరీలకు అసోసియేట్ డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఏషియన్ సుబ్బారావు, విటమిన్లపై తీవ్రంగా పరిశోధన కొనసాగించారు. యాంటీబయాటిక్స్ మందుల రూపకల్పనలో సుబ్బారావు గొప్ప పరిశోధన జరిపారు. 1942లో లీడర్లీ కంపెనీ రీసెర్చి డైరెక్టరుగా అత్యున్నత స్థానాన్ని అధిగమించారు. సుబ్బారావు ఫోలిక్ యాసిడ్పై కొనసాగించిన కృషి ఎంతో మంది మరణానికి కారణమైన స్ఫ్రూ జబ్బు నివారణకు కారణమైంది. ఇది వైద్య విజ్ఞాన పరిశోధనలో ఒక విశిష్ట ఘట్టం. ఫోలిక్ యాసిడ్ రూపొందించ డంతో సుబ్బారావు ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తం అయింది. అదే విధంగా బోదకాలు రావడానికి కారణాలు పరిశోధించి ఫైలేరియాను నివా రించడంలో అద్వితీయ కృషి సల్పాడు. అంతేకాదు, యాంటీ బయోటిక్స్పై పరిశోధన చేసి, వ్యాధి నిరోధానికి రూపకల్పన చేశారు. యాంటి బయోటిక్స్ చరిత్రలో ఆరోమైసిన్ కనుగొనడం ఒక అపూర్వమైన విషయం. దీనినే వైద్యపరిభాషలో క్లోరో టెట్రాసైక్లిన్ అంటారు. న్యూయార్క్లో వైద్య శాస్త్రజ్ఞుల మహాసభలో తాను కనుగొన్న ఆరోమైసిన్ గురించి వివరించిన రెండు వారాల లోనే సుబ్బారావు 1948 ఆగస్టు 7వ తేదీ అర్థరాత్రి న్యూయార్క్లో నిద్రలోనే కన్నుమూశారు. ప్రపంచంలో ప్రముఖ పత్రికలన్నీ అతని మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.యల్లాప్రగడ దశాబ్దాలు అమెరికాలో వున్నా భారతీయ పౌరునిగానే వుండి తన దేశాభిమానం చాటారు. మహాత్మాగాంధీపై అభిమానంతో చాలా కాలం ఖద్దరు బట్టలే ధరించాడు. అఖండ ప్రజ్ఞాశాలి యల్లాప్రగడ స్మార కార్థం మనదేశం పోస్టేజిస్టాంపు విడుదల చేసింది. యల్లాప్రగడ సుబ్బారావు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం.

పరిశోధనలు
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను.

సుబ్బారావు సహచరుడు మరియు 1988లో గెట్రూడ్ ఎలియాన్ తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".

కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి