15, మార్చి 2014, శనివారం

దేశమును ప్రేమించుమన్నా -------- గురజాడ అప్పారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం



దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి

తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్
‌

---------------------------------
గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ఈ ప్రముఖ గేయానికి ద్వారం వెంకటస్వామి నాయుడు స్వరాలను కూర్చారు. దీనిని కృష్ణా పత్రిక ఆగష్టు 9, 1913 తేదీన ప్రచురించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి