15, డిసెంబర్ 2013, ఆదివారం

వేమన శతకము

అరయ నాస్తియనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని దన్నుకొనక
తనది గాదనుకొని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ వినురవేమ.


ఏదీ ఆశించక ఇచ్చిన దానమే కోటిరెట్లు ఫలము.తనను అడగవచ్చినప్పుడు లేదనకుండా,తొట్రుపాటు లేకుండా,ఇవ్వనా?వద్దా అని మనసులో అలోచించక ఇచ్చే వస్తువు మీద మమకారము విడిచి దానము చేసినచో ఆ దానము కోటిరెట్లు ఫలమునిచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి