27, నవంబర్ 2013, బుధవారం

వేమన శతకము

కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడి గలుగువాని బానిసకొడుకులు!
విశ్వదాభిరామ వినురవేమ.


మంచి కులములో పుట్టినవాడు, గౌరవము కలవాడు,చదువు వలన గర్వపడు వాడు వీరందురును ఐశ్వర్యము కలవానికి బానిడలుగానే బ్రతకవలయును.అనగా వారందురును ధనవంతుని ఆశ్రయించి ఉండవలసిన వారే. లేనిచో వారికి జీవనము లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి