తెలుగువచ్చి యుండి తెలుగు పల్కనివాడు
తెలుగుప్రేమ లేని తెలుగువాడు
తెలుగునాట పుట్టి తెలుగునేర్వని వాడు
పిచ్చివాడు మిగుల పేదవాడు
నిండుచెరువున స్వచ్చమో నీటిభాష
పకపక నవ్వెడు పైరుభాష
చెట్టుచుట్టును తిరిగెడి పిట్టభాష
తేనేపనసలతోట నా తెలుగుభాష
.................................................................................. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి