10, మార్చి 2014, సోమవారం

సత్యేంద్రనాథ్ బోస్

చిత్రం: సత్యేంద్రనాథ్ బోస్

మన దేశం గర్వించదగిన శాస్త్రవేత్త లలో సత్యేంద్ర నాథ్ బోసు ఒకరు. సత్యేంద్రనాథ్ బోస్(జనవరి 1, 1894 - ఫిబ్రవరి 4 ,1974) భారత దేశ బౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందారు.
బోస్ కలకత్తా లో జన్మించారు. ఆయన 1920 లలో క్వాంటం మెకానిక్స్ లో బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ మరియు బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందారు. ఆయన భారత దేశం లో రెండవ అత్యున్నత అవార్డు అయిన పద్మ విభూషణ ను 1954 లో పొందారు.
ప్రస్తుతం విశ్వంలో వ్యాపించిఉన్నాయని భావిస్తున్న దైవకణాలకు ఆయన పేరును అనగా హిగ్స్-బోసన్ కణాలని పాల్ డిరాక్ నామకరణం చేశారు. .
పదార్థానికి వాయు, ఘన, ద్రవస్థితులతో పాటు ప్లాస్మా అనే నాలుగవ స్థితి ఉందని మనందరికి తెలుసు. ఐదవ స్థితి అనేది మరోకటి ఉందని దాదాపు 70 సంవత్సరాల క్రితం సూత్రీకరణ చేయబడింది. అయితే దానిని ప్రయోగాత్మకంగా 1995 జూన్ 5వ ధృవీకరించారు. ఈ ఐదవ స్థితిని ఊహించిన శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్. (ఎస్. ఎన్ బోస్) ఆయన పేరుతోనే ఐదవ స్థితిలోని పదార్థాన్ని బోస్ ఐన్ స్టీన్ కండెన్సేట్ అంటారు.
పదార్థానికి పంచమస్థితిని కనుగొని ప్రపంచానికి కొత్త అంశా న్ని పరిచయంచేసిన ఎస్.ఎన్ 1894 జనవరి 1వ తేదిన జన్మించారు. స్వాతం త్య్రానికి పూర్వం సుప్రసిద్ధులైన భారతీయ శాస్త్రవేత్తల్లో ఆయన అగ్రగణ్యులు. సి.వి.రామన్. జగదీశ్ చంద్రబోస్, సాహు మొదలైన శాస్త్రవేత్తల కోవలోకి వస్తారు. అత్యంత ప్రతిభా వంతుడైన శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ను అబ్బుర పరిచిన భారతీయ శాస్త్రవేత్త, పరి శోధకుడు సత్యేంద్ర నాథ్ బోస్. 
కేంద్రక భౌతి క శాస్త్రంలో బోస్ చేసిన సేవల కు గుర్తుగా ఒక తెగ మౌలిక కణాల కు బోనస్లని పేరు పెట్టా రు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరిం చింది.
అణువులు మధ్య దూరాన్ని బట్టి పదార్థం యొక్క స్థితి నిర్థారించ బడుతుందని ఆయన తన పరి శోధనల ద్వారా నిరూపిం చారు. ఘన పదార్థంలో అణువులు చాలా దగ్గరగా ఉండటమే కాకుండా వాటి మధ్య ఆకర్షణ బలాలు బలం గా ఉంటాయని, ద్రవపదార్థాల లో ఈ ఆకర్షణ తక్కువగా ఉండ డం వల్ల అణువులు దూరం గా ఉంటా యని ఆయన వివరిం చారు. ఇక వాయు స్థితి లోని అణు వులు చాలా దూరంగా ఉండి స్వేచ్ఛ గా ఉంటాయి. వీటికి ఉదాహారణ ఐస్, ముక్కలు, నీరు, నీటి ఆవిరి. అయితే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉదాహరణకు సూర్యుడు, నక్షత్రాల మధ్య భాగంలో పదార్థపు నాలువ స్థితి వుంటుంది. ఇక్కడ అణువుల నుండి ఎలక్ట్రాన్లు కొన్ని విడివిడి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక ఆవేశం గల అయాన్లు ప్రదర్శిస్తుంది. ఆ విశ్వంలో దాదాపు 99 శాతం పదార్థం ప్లాస్మా స్థితిలో వుందని తేలింది. ఈ నాలుగు స్థితులకు భిన్నంగా ఐదవ స్థితి వుందన్న ఇద్దరు మేధావుల అటామిక్ కల 70 సంవత్సరాల తరువాత నిజమైంది.
1924 సంవత్సరంలో సత్యేంద్రనాథ్ బోస్ సైద్ధాంతిక సూత్రీకరణ కొత్తరకంగా చేసి ఐస్ స్టీన్కు చూడమని పంపాడు. దాన్ని చూసి ఆశ్చర్యపడి, ఐన్ స్టీన్ మరికొంత జోడించి ప్రఖ్యాత పరిశోధనా పత్రికకు పంపారు. ఐదవ స్థితిని, వీరు లెక్కించిన పద్ధతి బోస్ ఐన్ స్టీన్ స్టాటిస్టిక్స్గా ప్రాచుర్యం పొందింది. బోస్ ఐన్స్టీ న్ సూత్రీకరణలో ఐదవ స్థితి సాధ్యమే అన్నారు. అయితే అది 273.15 డిగ్రీల సెన్సియస్ దగ్గర అసాధ్యమని భావిస్తూ వచ్చారు. కాని కొత్త టెక్నాలజీ రావడంతో ఆ ఉష్ణోగ్రత కోసం ప్రయత్నాలు సాగాయి. 1995 జూన్ 5న ఇవి ఫలించాయి. దీన్ని సాధించినవారు అమెరికాలోని కొలరాడోకు చెందిన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్ అండ్ టెక్నాలజీలో పని చేసే శాస్త్రావేత్తల బృందం. వారిలో సి.ఇ. వైమన్, ఇ.ఎ.కార్నెల్ అనే వారికి 2001 నోబెల్ బహుమతి లభించింది. 2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్  దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్  హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది. ఈ  నోబెల్ బహుమతి లో  గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందిన ప్రసిద్ద శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ చేసిన కృషి. ఈ దైవ  కణం ఉనికిని 1926  ప్రాంతంలోనే వారు ప్రతిపాదించారు. ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చింది. ఈ కణం నుండే సృష్టిలోని గ్రహాలూ,నక్షత్రాల వరకు సమస్త పదార్దానికి ద్రవ్యరాశి చేకూరుతుంది.  స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఈ కణం ఉనికి నిజమని నిరూపించారు.

ఆయన స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. ఆయన అనేక రంగాలలో అనగా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము , జీవ శాస్త్రము , లోహ సంగ్రహణ శాస్త్రము , తత్వ శాస్త్రము, కళలు , సాహిత్యం మరియు సంగీతం కృషిచేశారు. ఆయన స్వతంత్ర్య భారత దేశంలో అనేక పరిశోధనా కమిటీలలో పనిచేసి విశేష సేవ చేశారు. ఆయన 1974 ఫిబ్రవరి 4న మరణించారు. వారి శతజయంతి సందర్బంగా మన తపాలా శాఖ 1-1-1994 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి