16, మార్చి 2014, ఆదివారం

ద్వారం వెంకటస్వామి నాయుడు

చిత్రం: ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు (Dwaram Venkataswamy Naidu) (జ.8 నవంబర్ 1893 - మ. 25 నవంబర్ 1964) ఒక గొప్ప వయొలిన్ (వాయులీనం) విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941 లో ఇతనికి సంగీత కళానిధి అవార్డ్ ప్రధానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది.

ఇతను బెంగళూరులో దీపావళివాడు జన్మించాడు. విశాఖపట్నంలో పెరిగాడు.. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా నియమితుడయ్యాడు. 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.

నయొలిన్ వాయిద్యం ఒంటరి కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇవ్వడం ఇతనే ఆరంభించాడు. మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాల ఆడటోరియంలో ఇతని కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఇతని వయొలీన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నారు ఇంటిలో విని ఎంతో ప్రశంసించాడు.

ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి. కర్ణాటక సంగీతం వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ఇతనే కావచ్చును. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశాడు. "తంబూరా విశిష్ట లక్షణాలు" అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం "వివిపించే తపస్సు" అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఇతను శిష్యులకు చెప్పేవాడు. - ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి - అని చెప్పేవాడు.

చెన్నైలో "శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి