15, మార్చి 2014, శనివారం

గురజాడ అప్పారావు

చిత్రం: గురజాడ అప్పారావు

గురజాడ అప్పారావు(1862 సెప్టెంబర్ 21 -  1915 నవంబర్ 30) గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

"తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి"
"డామిట్! కథ అడ్డంగా తిరిగింది"
"పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్"

విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.
అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా, రెవిన్యూ సూపర్వసరు మరియు ఖిలేదారు గాను పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లి లో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రిగారు కాలం చెయ్యటంతో, విజయనగరంకి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో ఏం. ఆర్. కాలేజి, అప్పటిప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి గారు ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరు గా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

గురజాడ అప్పారావు గారు  తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.

వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.
గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.
అప్పటి కళింగ రాజ్యం గా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావుగారు ఉండడం జరిగింది. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో మంచి సంబంధాలు ఉండేవి. 1887 లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వీరు మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాన్గిక సేవకై "విశాఖ వలంటరి సర్వీసు" లో చేరారు. 1889 లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. 1897లో మహారాజ ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి ఆంతరంగిక సెక్రెటరీగా నియమింపబడ్డారు.
1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆప్ఫీసులో హెడ్ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యత్వం లభించింది. 1913 లో అప్పారావు గారు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో" తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు.

గురజాడ సూత్రాలు:-

• వ్యక్తి స్వేచ్ఛను సాధించండి. అందువల్ల దేశం స్వతంత్ర దేశమవుతుంది. జాతి మత కుల భేదాలు మరచి ప్రేమను పంచండి. ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది. కామించవద్దు, ప్రేమించండి.
• మనిషిని దేవుడిగా కొలుచుకో... స్వర్గాన్ని నేలకు దింపుకో.
• పరిశ్రమల కంటే పాడిపంటలకు పెద్దపీట వెయ్యండి, దేశం సుభిక్షమవుతుంది. చేతివృత్తులను పోషించండి. దిగుమతులు వద్దు, అన్ని దేశాలలోను దేశిసరుకులను అమ్మండి- ఇది గురజాడ ఆర్థిక సూత్రం.
• విద్యను ప్రభుత్వమే నిర్వహించాలి. వ్యక్తుల చేతిలో ఉంచకూడదు. అబద్ధాలు చెప్పే చదువులు ఆపండి. అసలు నిజాలు చెప్పే చదువులు మొదలు పెట్టండి. అర్థం కాని, ఉపయోగపడని చదువులు మనకొద్దు.
• చదువు కొందరి కోసం కాదు, అందరికీ. మాతృభాషలోనే చదువు చెప్పాలి. ఇతర భాషలో విద్యాబోధన చేయవద్దు.
• ఆరోగ్యంతో కూడిన జాతి అభ్యుదయాన్ని సాధిస్తుంది. జాతి బలపడితే దేశం బలపడుతుంది. దేశాభిమానాన్ని మొలకెత్తించే సాహిత్యాన్ని, కళలను సృష్టించండి. ఇది అందరినీ ఏకం చేసే దారి.
• మనసు నిర్మలంగా ఉంటే మేధ మెరుగుపడుతుంది. అది దేశానికి తరుణోపాయాన్ని చూపిస్తుంది.
• కత్తులు దూయడం మానుకో... కత్తు కలపడం నేర్చుకో. ఎదుటివాడికంటే ఎక్కువ నేర్చుకో... ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపో.
• ఇతరుల సంపద కోసం ఆశపడకు, కలిగినంతలో లేనివారికి సహాయం చెయ్యి. ఇది జాతిని శీలవంతం చేయడానికి ఉపదేశించిన మహాసూక్తం.
• కబుర్లుచెప్పే కాలం గడిచిపోయింది, కార్యక్షేత్రంలో దూకాల్సిన సమయం ఆసన్నమైంది. ఆశయం కాదు, ఆచరణ ప్రధానం.గురజాడ అప్పారావు(1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

• కబుర్లుచెప్పే కాలం గడిచిపోయింది, కార్యక్షేత్రంలో దూకాల్సిన సమయం ఆసన్నమైంది. ఆశయం కాదు, ఆచరణ ప్రధానం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి